హత్య కేసులో ముగ్గురి అరెస్ట్‌

హత్య కేసులో ముగ్గురి అరెస్ట్‌

ముగ్గురు వ్యక్తుల్ని ఓ హత్య కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయినవారంతా ఆసియా జాతీయులేనని అధికారులు వివరించారు. నిందితులు ముగ్గురూ కలిసి ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. హతుడు కూడా ఆసియా జాతీయుడే. తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతోనే నిందితులు, తమ సహచరుడ్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్గిఏషన్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ డివిజన్‌ - ఇంటీరియర్‌ మినిస్ట్రీ అత్యంత వ్యూహాత్మకంగా విచారణ జరిపి నిందితుల్ని అరెస్ట్‌ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. హత్యకు వినియోగించిన ఆయుధాల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి తీవ్రమైన కత్తి పోట్లతో రోడ్డుపై పడి వుండగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. విచారణలో అతన్ని హత్య చేసింది సహచరులేనని తేలింది. 

Back to Top