కువైటీ మాల్‌లో యుద్ధం: పలువురి అరెస్ట్‌

కువైటీ మాల్‌లో యుద్ధం: పలువురి అరెస్ట్‌

కువైట్‌: క్యాపిటల్‌ రపావిన్స్‌లోని ఓ ప్రముఖ మార్కెట్‌లో కొందరు కువైటీలు పబ్లిక్‌గా కొట్టుకుంటున్న ఘటన గురించిన సమాచారం అందగానే పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనలో కొందర్ని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. పబ్లిక్‌లో న్యూసెన్స్‌ క్రియేట్‌ చేసినందుకు వారిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో అహ్మది పోలీసులు, ఓ కువైటీని అరెస్ట్‌ చేశారు. ఫింటాస్‌లో అతన్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. మరో ఘటనలో జహ్రా పోలీస్‌, తప్పతాగి మైకంలో వున్న ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇదిలా వుంటే, కారు దొంగతనం కేసులో గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

Back to Top