ఇండియన్ టైకూన్‌ని సత్కరించిన షేక్ హమదాన్
- May 24, 2019
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ల్యాండ్ మార్క్ గ్రూప్‌ని ఫస్ట్ స్పోర్ట్స్ ఇంప్రింట్ అవార్డ్‌తో సత్కరించారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ మరియు వతానీ అల్ ఎమరాత్ ఫౌండేషన్ సహకారంతో ఈ అవార్డుని అందించారు. నాద్ అల్ షెబా స్పోర్ట్స్ టోర్నమెంట్ సందర్భంగా ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఛైర్మన్ కూడా అయిన షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ సందర్భంగా ల్యాండ్ మార్క్ గ్రూప్ ఛైర్మన్ మిక్కీ జగితియానీని సత్కరించారు. బెస్ట్ డయాబెటిస్ వాక్ పేరుతో డయాబెటిస్ పట్ల అవగాహన కలిగించేందుకు ల్యాండ్ మార్క్ సంస్థ చేపట్టిన కార్యక్రమాల్ని అభినందించారు షేక్ హమదాన్. 20,000 మందికి పైగా పార్టిసిపెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అలాగే ఎమిరేట్స్ డయాబెటిస్ సొసైటీకి మద్దతుగా ల్యాండ్ మార్క్ పలు కార్యక్రమాలు చేపడుతోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







