కోలకతాలో డెలివరీ బాయ్ ఔదార్యం
- May 24, 2019
కోలకతా:అన్నా ఆకలైతుంది. ఓ పది రూపాయలుంటే ఇయ్యవా.. మూడు రోజులైంది అన్నం తిని.. రొట్టె కొనుక్కుని తింటా.. అని చింపిరి జుట్టు, చిరిగిన చొక్కా వేసుకున్న మురికి వాడకు చెందిన ఓ బాలుడు కాళ్లకి అడ్డం పడేసరికి పతిక్రిత్‌కి జాలేసింది. కానీ ఆ వెంటనే కోపం కూడా వచ్చింది వాడితో మాట్లాడేసరికి. కారణం వాడు డ్రగ్స్‌కి బానిసయ్యాడని తెలుసుకున్నాడు. అందుకే మరో ఆలోచన లేకుండా వాడి చెంప పగలగొట్టాడు పతిక్రిత్. ఆ పిల్లాడు కన్నీరు మున్నీరై అతడి కథ మొత్తం చెప్పాడు. దాంతో డబ్బులిస్తే మళ్లీ డ్రగ్స్ కొంటాడని కడుపు నిండా అన్నం పెట్టించాడు.
అతడి కళ్లలో ఆనందాన్ని చూసి అప్పుడే నిర్ణయించుకున్నాడు వారి కోసం ఏమైనా చేయాలని. కోలకతాకు చెందిన పతిక్రిత్ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేసేవాడు. నాలుగేళ్ల కిందట కోల్‌కతాలోని డుమ్ డుమ్ కంటోన్మెంట్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఓ బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ల మీద పడ్డాడు. వాడి ఆకలి తీర్చిన ఆనందం తన ఉద్యోగ రాజీనామాకు దారి తీసింది. జొమాటోలో డెలివరీ బాయ్‌గా జాయినయ్యాడు. అక్కడ కస్టమర్లు క్యాన్సిల్ చేసిన ఆహారాన్ని మురికి వాడల్లో నివసిస్తున్న బాల బాలికలకు ఇస్తూ వారి కడుపు నింపుతున్నాడు. నాలుగు అక్షరం ముక్కలు నేర్పిస్తున్నాడు. నాలుగు డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని చూపుతున్నాడు.
జన సంచారం ఉన్న ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్లలో, బస్టాపుల్లో వాటర్ బాటిల్ స్టాల్స్ ఏర్పాటు చేసి వారికి ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈ మధ్య ఓ రెస్టారెంట్ యజమాని పతిక్రిత్‌కి స్నేహితుడయ్యాడు. అతడితో మాటల మధ్యలో కస్టమర్లకు వడ్డించగా మిగిలిపోయిన ఆహారాన్ని పేద పిల్లలకు అందించమని పతిక్రిత్ అడిగాడు. అందుకు స్నేహితుడు కూడా ఆనందంగా ఒప్పుకున్నాడు. పేద బాలల కడుపు నింపుతున్న పతిక్రిత్‌ని వారంతా అన్నా, రోల్ కాకు అని ప్రేమగా పిలుచుకుంటున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..