రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ళ చిన్నారి మృతి
- May 24, 2019
బహ్రెయిన్:దార్ కులైబ్ విలేజ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నాలుగేళ్ళ చిన్నారిని బలి తీసుకుంది. హమాద్ టౌన్ దగ్గరలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన చిన్నారిని రీమ్ హుస్సైన్ అల్ అరాదిగా గుర్తించారు. ఓ ఫ్లవర్ షాప్ వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కారు చిన్నారిని ఢీకొంది. విలేజ్ ప్రారంభంలో తన తండ్రికి చెందిన ఓ ఫ్లవర్ షాప్ వద్దకు చిన్నారి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్‌కి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. 'ఈ జీవితంలో నాకున్న ఒకే ఒక్క అతి ముఖ్యమైన వ్యక్తివి నువ్వు. నిన్ను నేను కోల్పోయాను. వింటున్నావా, నీ తండ్రి నిన్నెంతో ప్రేమిస్తున్నాడు' అని ఆ చిన్నారి తండ్రి తన కూతురి కోసం రాసిన అక్షరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, చాలామందికి కంటతడి పెట్టిస్తున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..