100 విమానాల క్లబ్‌లో చేరిన నాలుగో దేశీయ సంస్థ గా స్పైస్‌జెట్

100 విమానాల క్లబ్‌లో చేరిన నాలుగో దేశీయ సంస్థ గా స్పైస్‌జెట్

వంద విమానాలతో సేవలు అందిస్తున్న నాలుగో దేశీయ విమానయాన సంస్థగా స్పైస్ జెట్ రికార్డులకెక్కింది. బోయింగ్ 737 విమానంను యాడ్ చేసుకోవడం ద్వారా ఈ సంస్థ వద్ద ఉన్న విమానాలు వందకు చేరుకున్నాయి. స్పైస్ జెట్ వద్ద బోయింగ్ 737ఎస్ విమానాలు 68, బొంబాడియర్ క్యూ 400ఎస్ విమానాలు 30, బీ737 విమానాలు 2 ఉన్నాయి. వీటితో రోజూ 53 దేశీయ, 9 అంతర్జాతీయ గమ్యస్థానాలకు (మొత్తం గమ్యస్థానాలు 62) యావరేజ్‌గా 575 సర్వీసులను స్పైస్ జెట్ రన్ చేస్తోంది. ఎయిరిండియా, జెట్ ఎయిర్వేస్, ఇండిగో తర్వాత వంద విమానాల ఘతన సాధించిన దేశఈయ సంస్థల్లో స్పైస్ జెట్ నాలుగవది. 2014 డిసెంబర్‌లో మూసివేత దశకు చేరిన సంస్థ, 2019 మధ్యకల్లా 100 విమానాల ఘనత సాధించడం గర్వనీయ అంశమని స్పైస్ జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. గత నెల రోజుల్లో స్పైస్ జెట్ 23 విమానాలు యాడ్ చేసినట్లు తెలిపారు. ఎక్కువ విమానాలు ముంబై, మెట్రో వంటి మెట్రో నగరాలను కలుపుతున్నాయన్నారు. నరేష్ గోయల్ దంపతుల్ని విమానం నుంచి దించేశారు స్పైస్ జెట్ గురుగ్రామ్ బేస్డ్ ఎయిర్ క్యారియర్. కేంద్ర ప్రభుత్వం యొక్క రీజినల్ కనెక్టివిటీ స్కీం (UDAN) ప్రాంతీయ విమానయాన స్కీం కింద రోజుకు 42 సర్వీసుల్ని నడుపుతోంది. ఇండిగో 230, ఎయిరిండియా 128, స్పైస్ జెట్ 100 విమానాలు నిర్వహిస్తున్నాయి. గ ఎయిర్ 49, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ 25, విస్తారా 22, ఎయిరేషియా 21 విమానాలు ఆపరేట్ చేస్తున్నాయి. ప్రాంతీయ సేవలు అందించే అలయన్స్ ఎయిర్ 20 ఏటీఆర్‌లతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

Back to Top