ఐఓసీ ప్యానెల్‌ మెంబర్‌గా షేకా హయాత్‌

ఐఓసీ ప్యానెల్‌ మెంబర్‌గా షేకా హయాత్‌

బహ్రెయిన్‌ ఒలింపిక్‌ కమిటీ (బిఓసి) బోర్డ్‌ మెంబర్‌, విమెన్స్‌ స్పోర్ట్‌ కమిటీ ఛెయిర్‌ విమెన్‌ షేకా హయాత్‌ బింట్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ ఖలీఫా, ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ విమెన్‌ ఇన్‌ స్పోర్ట్‌ కమిషన్‌ కొత్త మెంబర్‌గా నియమితులయ్యారు. గతంలో షేకా హయాత్‌ ఐఓసీ అథ్లెట్స్‌ ఎంటరేజ్‌ కమిషన్‌ మెంబర్‌గా వరుసగా రెండు పర్యాయాలు పనిచేశారు. తదుపరి టెర్మ్‌కి సంబంధించి 32 మంది కొత్త సభ్యులతో కలిసి షేకా హయాత్‌ కొత్త పదవి చేపట్టబోతున్నారు. లిడియా న్సెకెరా ఆఫ్‌ బురుంది ఈ కమిషన్‌ ఛెయిర్‌ విమెన్‌గా పనిచేస్తారు. జోర్డాన్‌కి చెందిన ప్రిన్స్‌ ఫైసల్‌ బిన్‌ అల్‌ హుస్సేన్‌ వైస్‌ ఛైర్మెన్‌గా వ్యవహరిస్తారు. కాగా, బిఓసి సెక్రెటరీ జనరల్‌ మెహమ్మద్‌ అల్‌ నుసుఫ్‌, షేకా హయాత్‌కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 

 

Back to Top