ఓపెన్‌ ఏరియాస్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్క్‌ బ్యాన్‌

ఓపెన్‌ ఏరియాస్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్క్‌ బ్యాన్‌

కువైట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ (పిఎఎం), జూన్‌ 1 నుంచి ఆగస్ట్‌ 31 వరకు పని గంటలకు సంబంధించి మిడ్‌ డే బ్రేక్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. అత్యంత తీవ్రంగా ఉష్ణోగ్రతలు మారుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్‌ ఏరియాస్‌లో కార్మికులు పని చేయకుండా ఈ మిడ్‌ డే బ్రేక్‌ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. యజమానులు మిడ్‌ డే బ్రేక్‌ని ఖచ్చితంగా అమలు చేయాలనీ, లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు వివరించారు. 

Back to Top