వెంకిమామ రిలీజ్ డేట్ ఫిక్స్
- May 27, 2019
మన టాలీవుడ్ లో ఇద్దరు హిరోలు కలిసి చేసిన సినిమాలా చాలానే ఉన్నాయి. అయితే మన విక్టరీ వెంకటేష్ కూడా చాలా సినిమాలే చేశాడు. గతంలో పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల చిత్రం బాక్సాఫిక్స్ వద్ధ అంతగా పెద్ద హిట్ కాకపోయినా... రీసెంట్ గా విడుదలైన ఎఫ్2 చిత్రం భారీ విజయానలు అందుకుంది. ఇప్పుడు మరో సినిమాకు రెడీ అయ్యాడు వెంకీ.
వెంకి మామ చిత్రంతో ఇప్పుడు మన ముందుకు రానున్నడు హిరో వెంకటేష్. మరో హిరోగా మజిలీ హిరో నాగచైతన్య తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ చేశారు. ప్రస్తుతం కాశ్మీర్ లో లాంగ్ షెడ్యూల్ జరుగుతున్నది. బోర్డర్ కు పల్లెటూరికి ఉన్న సంబంధం ఏంటి అన్నది సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
సెప్టెంబర్ 13 వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని చేయబోతున్నారని వార్తలు అందుతున్నాయి. అయితే, ఆ డేట్ ఎందుకు ఫస్ట్ చేశారనే విషయం తెలియదు. ఇది కేవలం పుకార్లేనా లేదంటే నిజంగానే ఆ డేట్ కు సినిమా రిలీజ్ అవుతుందా అన్నది తెలియాలి. ఎన్టీఆర్ తో జై లవకుశ తరువాత దర్శకుడు బాబీ చేస్తున్న సినిమా ఇదే. ఇందులో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







