తండ్రికి సూపర్‌స్టార్‌ గిఫ్ట్

తండ్రికి సూపర్‌స్టార్‌ గిఫ్ట్

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ 31న తన 76వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు మహేశ్‌బాబు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయాలనుకుంటున్నారట. అంతేకాదు ఆయనకు బర్త్‌డే కానుకగా తన 26వ సినిమా గురించి ప్రకటించబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. త్వరలో మహేశ్‌.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటిస్తారు. ఈ విషయాన్ని అనిల్‌ ఇటీవల ట్విటర్‌ వేదికగా కాస్త వినూత్నంగా ప్రకటించారు. 31న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది. 

అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్‌ నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. అనిల్‌ సుంకర ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారు. ‘దూకుడు’, ‘f2’ లాగే ఈ సినిమా కూడా వినోదాత్మకంగా ఉంటుందని చిత్రవర్గాలు అంటున్నాయి. ‘మహర్షి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న మహేశ్.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఎంజాయ్‌ చేస్తున్నారు.

Back to Top