ఏప్రిల్ 8న 'సర్దార్ గబ్బర్‌సింగ్'
- January 02, 2016
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులకు శుభవార్త. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా విడుదల తేదీ ఖరారైనట్టు సమాచారం. ఏప్రిల్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' ప్రాజెక్టు విషయంలో బాగా జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తుది దశ షూటింగ్ ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది. 'జనవరి 4 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది సుదీర్ఘమైన షెడ్యూల్. దాదాపు నెలపాటు ఉంటుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతుంది. సినిమా ఏప్రిల్‌లో విడుదల చేయాలని పవన్‌కల్యాణ్ భావిస్తున్నారు' అని చిత్రానికి సంబంధించి విశ్వసనీయవర్గాలు తెలిపాయి.ఈ సినిమా షూటింగ్ పూర్తయి.. ఇంకా పోస్టు ప్రోడక్షన్ వర్క్‌లోకి వెళ్లకముందే సినిమా హక్కుల కోసం డిస్టిబ్యూటర్లు పోటీపడుతున్నట్టు తెలుస్తున్నది. 2012లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్' సినిమాకు 'సర్దార్ గబ్బర్‌సింగ్' సీక్వెల్‌గా వస్తున్నది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







