ఎస్పీకి 'స్వరకళాసామ్రాట్' బిరుదు..
- January 02, 2016
విశాఖ కేంద్రంగా విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు కార్యక్రమాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను సన్మానించారు. ఎస్పీకి స్వరకళాసామ్రాట్ బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుజాతికి కీర్తి తెచ్చిన వ్యక్తి ఎస్పీ అని కొనియాడారు. బాలసుబ్రహ్మణ్యం ఎందరో గాయకులను వెలుగులోకి తెచ్చారని అన్నారు. 50 ఏళ్ల పాటు ఎలాంటి పోటీ లేకుండా ఆయన రాణించారని పేర్కొన్నారు. విశాఖ భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడ ప్రముఖ పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతోందని చంద్రబాబు అన్నారు. విశాఖ ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, తొమ్మిది దేవాలయాల నమూనాల ప్రాంగణం అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లెరఘునాథ్‌రెడ్డి, సంగీత దర్శకుడు కీరవాణి, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







