ఫ్లైట్‌లో ప్యాసింజర్ మృతి.. కారణం తెలిసి అవాక్కయిన డాక్టర్లు
- May 28, 2019
మెక్సికో: అతనో డ్రగ్ డీలర్.. మెక్సికో నుంచి జపాన్‌కు డ్రగ్స్ తరలిస్తుంటాడు. ఇప్పటికే చాలాసార్లు ఆ పని చేశాడు. కానీ ఈసారి అదృష్టం కలిసిరాలేదు. డబ్బు కోసం అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు.
జపాన్‌కు చెందిన ఉడో ఎన్ శుక్రవారం ఎప్పటిలాగే బొగోటో నుంచి టోక్యోకు బయలుదేరాడు. మెక్సోకోలో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. అయితే బొగోటో నుంచి మెక్సికోకు విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఫిట్స్ రావడంతో విమాన సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అయిన ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ దిగజారుతుండటంతో సోనోరాలోని హెర్మోసిల్లోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం రిక్వెస్ట్ చేశారు. అధికారులు అందుకు అంగీకరించడంతో విమానాన్ని అక్కడ దింపారు. అనారోగ్యం పాలైన ఉడో ఎన్‌ను పరిశీలించిన డాక్టర్లు.. అతను అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు.
ఉడో ఎన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్లు అతని కడుపులో ఉన్న పదార్థం చూసి ఆశ్చర్యపోయారు. అతని పొట్టతో పాటు పేగుల్లో 2.5సెంటీమీటర్ల పొడవున్న 246 ప్యాకెట్లలో కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా డ్రగ్స్ తరలించే క్రమంలో ఆ ప్యాకెట్లలో కొన్ని చిరిగిపోయినట్లు పోస్ట్‌మార్టంలో తేలింది. డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మెదడు వాపుతో అతను మరణించినట్లు రిపోర్టులో స్పష్టమైంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..