దుబాయ్-శంషాబాద్ వచ్చిన మహిళ నుంచి భారీగా బంగారం పట్టివేత
- May 28, 2019
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికురాలి లగేజీని తనిఖీ చేశారు. ఆమె బ్యాగు నుంచి సుమారు 11.1కిలోల బంగారంతో పాటు 1.5 కోట్ల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఏడు క్లాత్ ప్యాకెట్లలో బంగారం, విదేశీ కరెన్సీని తరలిస్తున్నట్టు గుర్తించామని వివరించారు. ఆ మహిళను అరెస్టుచేసి విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు. దుబాయ్ లో ఈ మహిళకు బంగారాన్ని ఎవరు ఇచ్చారు? ఇక్కడ ఎవరికి ఇవ్వమని చెప్పారు? గతంలో ఏమైనా బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిందా? తదితర కోణాల్లో ఆరా తీస్తున్నట్టు డీఆర్‌ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..