ఇందిరాగాంధీ పాత్రలో అలనాటి అందాల తార
- May 29, 2019
ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రవీనాటాండన్ ఇప్పుడు ముఖ్యపాత్రలలో మెరుస్తోంది. 90వ దశకంలో అక్కినేని నటించిన రధసారథిలోనూ, బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు చిత్రంలోనూ రవీనాటాండన్ కథనాయికగా నటించింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలే చేస్తూ వచ్చిన ఆమె ఇన్నేళ్ల తర్వాత దక్షిణాది సినిమాలో నటించేందుకు అంగీకరించిందన్న టాక్ హల్‌చల్ చేస్తోంది. ఆ మధ్య కన్నడంలో రూపొందిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలియంది కాదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్: చాప్టర్-2 చిత్రం తెరకెక్కుతోంది. చాప్టర్-1కు వివిధ భాషల్లో లభించిన ఆదరణ దృష్ట్యా సీక్వెల్‌ను నిర్మించే పనిలో చిత్రబృందం ఉంది. కాగా పీరియాడిక్ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించిన సన్నివేశాలున్నాయట. దాంతో ఆ పాత్రకు రవీనా అయితే న్యాయం చేకూరుస్తుందని, అంతేకాకుండా ఆమె నటించడం వల్ల బాలీవుడ్‌లో చిత్రాన్ని మార్కెట్ చేయడం కూడా సులువు అవుతుందని చిత్రబృందం భావించిందట. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







