అబుధాబి లో యాడ్నోక్ టవర్ పై మెరిసిన భారత జెండా

- May 31, 2019 , by Maagulf
అబుధాబి లో యాడ్నోక్ టవర్ పై మెరిసిన భారత జెండా

అబుధాబి:భారత దేశ ప్రధానిగా మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన వేళ అబుధాబిలో భారత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఆ దేశంలో ప్రఖ్యాత ఏడీఎన్‌ఓసీ టవర్లపై భారత మువ్వన్నెల జెండాతో పాటు ఆ దేశ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అలాగే ఆ దేశ యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్ నహ్యాన్‌తో మోదీ కరచాలనం చేసిన చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. ఈ అరుదైన ఘటనతో భారత్‌తో తమకున్న స్నేహబంధాన్ని అక్కడి ప్రభుత్వం చాటి చెప్పింది.

దీనికి సంబంధించిన వీడియోను అక్కడి భారత రాయబారి నవదీప్ సింగ్‌ పూరి ట్విటర్‌లో పంచుకున్నారు. ఇలాంటి చర్యలతో ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2015 ఆగస్టులో మోదీ అబుదాబి పర్యటన అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయని ఆయన గుర్తుచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com