బ్లింకింగ్ లైట్స్‌తో తగ్గుముఖం పట్టిన ప్రమాదాలు
- June 01, 2019
బహ్రెయిన్:రెడ్ టైట్ ఉల్లంఘనలు కింగ్డమ్లో తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త విధానం ద్వారా ఉల్లంఘనలతోపాటు ప్రమాదాలూ తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. గ్రీన్ లైట్ నుంచి ఎల్లో లైట్‌కి మారే క్రమంలో, మూడుసార్లు గ్రీన్ లైట్ బ్లింక్ అయ్యేలా కొత్త సాంకేతికతను ట్రాఫిక్ కూడళ్ళలో అమలు పర్చుతుండడంతోనే ఈ మార్పు సాధ్యమయ్యిందని ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారి వెల్లడించారు. జనరల్ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్రహ్మాన్ బిన్ అబ్దుల్ వహాబ్ అల్ ఖలీఫా మాట్లాడుతూ, ఇంటర్ సెక్షన్స్ వద్ద అమలు చేస్తున్న ఈ విధానంతో ప్రమాదాలు కొంతవరకు తగ్గాయని చెప్పారు. అల్ ఫతెహ్ ఇంటర్సెక్షన్లో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేశారు. ఆ తర్వాత క్రమక్రమంగా పలు కూడళ్ళలో ఈ కొత్త విధానంతో కూడిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ని ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు, ఉల్లంఘనలు తగ్గుముఖం పట్టాయి.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







