శ్రీహరి తనయుడు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
- June 02, 2019
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి 2013లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలో ఆయన హఠాత్తుగా మరణించడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పుడు శ్రీహరి పెద్ద తనయుడు మేఘాంశ్ హీరోగా వెండితెరకి పరిచయం కాబోతున్నాడు. రాజ్‌దూత్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో మేఘాంశ్ నటిస్తుండగా, రీసెంట్‌గా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ పక్కన లెదర్ జాకెట్, జీన్ ప్యాంటు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు మేఘాంశ్. ఈ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా భైరవ అనే సినిమాతో వెండితెరకి పరిచయమయ్యాడు. ఇందులో శ్రీహరి హీరోగా నటించారు. తండ్రి మరణం, స్టడీస్ కారణంగా కొంత కాలం సినిమాలకి దూరంగా ఉన్న మేఘాంశ్ ఇప్పుడు రాజ్‌దూత్ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. కొన్నాళ్ళ పాటు నటనలో శిక్షణ తీసుకున్న ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా అయ్యాడు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ మూవీని, కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ నిర్మిస్తున్నారు . రొమాంటిక్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘంష్ మాస్ రోల్ లో కనిపించనున్నాడట.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..