ఇరాన్‌ను సమర్ధిస్తే చమురు సరఫరాలు కట్..!
- June 02, 2019
మక్కా:గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాద దాడులతో ప్రపంచదేశాలకు చమురు సరఫరాలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం వుందని సౌదీ రాజు సల్మాన్ హెచ్చరించారు. ఇక్కడ జరుగుతున్న ఒఐసి దేశాల సదస్సులో శనివారం ఆయన మాట్లాడుతూ ఇరాన్‌ను సమర్ధిస్తే చమురు సరఫరాలు నిలిచిపోయే అవకాశం వుందని ఆయన మిత్రదేశాలకు సూచించారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా తమకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవలి కాలంలో ఎమిరేట్స్ సముద్ర తీరంలో జరిగిన దాడుల్లో సౌదీకి చెందిన చమురు నౌకలు దెబ్బతినటంతో ఇరాన్-సౌదీ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో తమ ప్రమేయం ఏమీలేదని ఇరాన్ సౌదీకి గట్టిగానే బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఓఐసి సదస్సు ముగింపు కార్యక్రమంలో రాజు సల్మాన్ మాట్లాడుతూ ఈ ఉగ్రవాద దాడులు కేవలం సౌదీకి మాత్రమే కాక గల్ఫ్‌ప్రాంత దేశాలకు, ప్రపంచ చమురు సరఫరాలకు వ్యతిరేకంగా జరిగినట్లు తాము భావిస్తున్నామన్నారు. తమకు ఎదురయ్యే ముప్పులను, విచ్ఛిన్న కార్యకలాపాలను తాము సమర్ధవంతంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







