మరొక థ్రిల్లింగ్ మూవీతో రాబోతున్న అడివి శేష్...
- June 03, 2019
అడివి శేష్ మొదట కర్మ అనే సినిమాకు తానే స్వయంగా కథను సమకూర్చి నటిస్తూ, దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఇక అక్కడినుండి అయన వరుసగా సినిమాల్లో నటించడం మొదలెట్టారు. అయితే ఆయనకు మాత్రం ఎక్కువగా నెగటివ్ పాత్రలే దక్కాయి. అయినప్పటికీ తన పాత్రలకు పూర్తి న్యాయం చేసిన శేష్ కు, తనలోని రైటర్ కు ఎప్పటికైనా మళ్ళి పని పెట్టి, ఎప్పటికైనా మంచి హిట్ అందుకోవాలని భావించారు.
అనుకున్న విధంగా తాను రాసుకున్న కథ నచ్చి, పివిపి నిర్మాతగా వ్యవహరిస్తూ తననే హీరోగా పెట్టి క్షణం సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. అప్పట్లో వచ్చిన క్షణం, చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత ఆయన కథను సమకూర్చి నటించిన గూఢచారి కూడా సూపర్ హిట్ అయి శేష్ కు రైటర్ మరియు నటుడిగా మంచి పేరు తీసుకువచ్చింది. అదే స్ఫూర్తి తో ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన బాఘీ-2 కి కథను అందించారు శేష్. ఇక ప్రస్తుతం అయన గూఢచారి సినిమా సీక్వెల్ లో నటిస్తున్నారు. కాగా నేడు మరొక్కసారి అయన పివిపి బ్యానర్ లో నటిస్తున్న కొత్త సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదలయింది.
ఎవరు పేరుతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా, పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ అని శేష్ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఏడాది ఆగష్టు 23న ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాలో శేష్ కు జోడిగా రెజీనా నటిస్తుండగా, ఈ చిత్రానికి దర్శకుడిగా వెంకట్ రాంజీ వహిస్తున్నారు. మరొక్కసారి థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అడివి శేష్, ఈ సారి ఎంతటి విజయాన్ని అందుకుంటారో వేచిచూడాలి...!!
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







