వాయు కాలుష్యంపై అవగాహన కోసం సైక్లింగ్‌

- June 03, 2019 , by Maagulf
వాయు కాలుష్యంపై అవగాహన కోసం సైక్లింగ్‌

బహ్రెయిన్: ఇండియన్‌ ఎంబసీ, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని 'ఎయిర్‌ పొల్యూషన్‌పై అవగాహన' కోసం సైక్లింగ్‌ ఈవెంట్‌ని నిర్వహించింది. బహ్రెయిన్‌ ఫోర్ట్‌ నుంచి ఇండియన్‌ ఎంబసీ వరకు ఈ సైక్లింగ్‌ జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని, ప్రతి ఏడాదీ జూన్‌ 5న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 1974 నుంచి ఈ కార్యక్రమంలో జరుగుతోంది. పర్యావరణానికి సంబంధించి అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఎంబసీ సరికొత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత రాయబారి అలోక్‌ కుమార్‌ సిన్హా ఈ కార్యక్రమ వివరాల్ని తెలియజేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com