భవనం పైనుంచి పడ్డ భారతీయ చిన్నారి
- June 03, 2019
షార్జా: ఆరేళ్ళ భారతీయ చిన్నారి, షార్జాలోని మువైలిహ్‌లోని ఓ భవనం పైనుంచి కింద పడిపోయింది. ప్రస్తుతం ఆమె వైద్య చికిత్స పొందుతోంది. ఆమెకు వైద్యం అందిస్తోన్న డాక్టర్లు, బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు తెలిపారు. అల్ కాసిమి ఆసుపత్రి నుంచి తమకు బాలికకు సంబంధించిన సమాచారం అందిందని పోలీసులు వివరించారు. ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోల్ అలాగే ఇన్వెస్టిగేషన్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించాయి. ఆడుకుంటూ బాల్కనీలోకి వచ్చిన బాలిక అక్కడినుంచి కింద పడిపోయినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఆ సమయంలో చిన్నారి పేరెంట్స్ ఇంట్లోనే వున్నా, ఆమెను గమనించలేదని పోలీసులు తెలిపారు. శరీరమంతా చిన్నారికి గాయాలు వున్నాయనీ, పలు భాగాలు ఫ్రాక్చర్స్ అయ్యాయని వైద్యులు వివరించారు. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ రెస్పిరేషన్‌పై (వెంటిలేటర్) చికిత్స పొందుతోంది చిన్నారి.
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







