షార్జాలో భవనం పైనుంచి పడి గాయపడ్డ వలస కార్మికుడు
- June 03, 2019
షార్జా:30 ఏళ్ళ భారతీయ వలస కార్మికుడు ఓ భవనంపైనుంచి కింద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. తలకు బలమైన గాయాలు కావడంతో ప్రస్తుతం అల్ కాసిమి హాస్పిటల్‌లోని ఐసీయూలో అతనికి వైద్య చికిత్స అందిస్తున్నారు. వలస కార్మికుడ్ని మహేంద్ర కుమార్‌గా గుర్తించారు. షార్జాలోని ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ కోసం పనిచేస్తున్నాడు మహేంద్ర కుమార్. భవనం మెయిన్‌టెనెన్స్ వర్క్ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ కింద పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఉదయం 9 గంటల సమయంలో సమాచారం తమకు అందిందనీ, వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళగా అక్కడ రక్తపు మడుగులో పడి వున్న కార్మికుడ్ని గుర్తించి, ప్రాథమిక చికిత్స అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..