రోడ్డు ప్రమాదంలో నాలుగు కార్ల ధ్వంసం, ఒకరి మృతి
- June 04, 2019
32 ఏళ్ళ ఆసియా వలసదారుడొకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. సెంట్రల్ రీజియన్‌లోని నజావి అల్ మదామ్ స్ట్రీట్ రౌండెబౌట్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన గురించిన సమాచారం అందగానే, ఘటనా స్థలికి ట్రాఫిక్ అధికారులు, అంబులెన్స్, పెట్రోల్స్ టీమ్ చేరుకున్నాయి. అప్పటికే ఓ వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించిన అధికారులు. గాయపడ్డవారిని హుటాహుటిన అల్ ధాయిద్ ఆసుపత్రికి తరలించారు. అతి వేగంతో ఓ కారు, మరో మూడు కార్లపైకి దూసుకెళ్ళడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. వేగంగా దూసుకొచ్చిన కారుని నడుపుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిలో కొందిరికి తీవ్రగాయాలు కాగా, కొందరికి ఓ మోస్తరు గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..