విశాఖపట్నంలో జగన్‌కు ఘనస్వాగతం
- June 04, 2019
విశాఖపట్నం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ చేరుకున్న వైఎస్ జగన్‌కు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి జగన్ ప్రత్యేక కాన్వాయ్‌లో శారదా పీఠానికి చేరుకున్నారు. శారదాపీఠంలో వేదపండితులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
సీఎం..తొలుత పీఠం అధిదేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి పూజల్లో పాల్గొంటారని పీఠం ప్రతినిధులు తెలిపారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ సందర్భంగా స్వామితో ఆంతరంగికంగా కాసేపు చర్చించే అవకాశం ఉంది. 2017లో పాదయాత్ర ప్రారంభానికి ముందు కూడా ఈ ఆశ్రమానికి వెళ్లి స్వామి ఆశీస్సులను జగన్ పొందారు. ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు మళ్లీ వెళుతున్నారు. ఈ నెల 8న మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో మంత్రుల పేర్ల విషయమై స్వరూపానందేంద్రను కలిసినపుడు చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..