మహేష్ బ్యానర్లో విజయ్ సినిమా.!
- June 04, 2019
మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది. మంచి డబ్బులు వచ్చాయి. తరువాత బ్రహ్మోత్సవం సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా మారారు. సినిమా ఫెయిల్ కావడంతో సొంత బ్యానర్లో మరో సినిమా చేయలేదు. ఇప్పుడు మహేష్ మరలా తన సొంత బ్యానర్ జిఎంబి సినిమాస్ లో సరిలేరు నీకెవ్వరూ చేస్తున్నారు.
ఇదిలా ఉంటె, మహేష్ బాబు సొంత బ్యానర్లో బయట హీరోలతో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. జిఎంబి సినిమాస్ లో అడవి శేష్ తో మేజర్ అనే సినిమా చేస్తున్నాడు. మహెష్ బాబు నిర్మాత. ముంబై దాడుల్లో మరణించిన ఆఫీసర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు జిఎంబి సినిమాస్ ప్లాన్ చేస్తోంది. మహేష్ బాబు బ్యానర్లో సినిమా అంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ప్రస్తుతం నమ్రత ఆ బిజీలోనే ఉన్నారట. విజయ్ సినిమా కోసం కావాల్సిన కథను సిద్ధం చేయిస్తున్నారని వినికిడి.
మరో సమాచారం ప్రకారం, మహేష్ 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ మూవీలో విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్. ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదుగాని, ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఇది నిజమైతే మహెష్ 26 కు ఓ స్పెషల్ వచ్చినట్టే. గీత గోవిందం హీరో హీరోయిన్లు ఇద్దరు ఈ సినిమాలో నటించినట్టు అవుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







