ఆకట్టుకుంటున్న 'సూపర్ 30' ట్రైలర్
- June 04, 2019
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ 30'. బిహార్‌కు చెందిన గణితవేత్త ఆనంద్ కుమార్ స్థాపించిన 'సూపర్30' అనే ఐఐటీ శిక్షణ సంస్థ నేపథ్యంలో ఈ సినిమాను వికాస్ బెహెల్ తెరకెక్కించారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.
'భారత్.. ఓ చీప్ లేబర్ దేశం అంటుంటారు. మరి పెప్సికో సంస్థకు అధినేతగా వ్యవహరించింది ఎవరు?యూనిలివర్ సంస్థను ఎవరు నడిపిస్తున్నారు? ఈ విషయాలు ఎవ్వరికీ తెలీకపోతే గూగుల్‌లో వెతకండి. అంతేకాదు గూగుల్‌ను శాసిస్తోంది ఎవరో కూడా అందులోనే తెలుసుకోండి. వీరందరూ మన భారతీయులే కదా' అన్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ఇందులో ఆనంద్‌కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ ఒదిగిపోయారు. ఆయన్ను ఓ విద్యా సంస్థ ఐఐటీ ప్రొఫెసర్‌గా నియమిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన విద్యా సంస్థలో ఉద్యోగం మానేసి సొంతంగా కోచింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఏటా 30 మంది ఉత్తమ విద్యార్థులకు ఉచితంగా ఐఐటీలో కోచింగ్ ఇస్తుంటారు. ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి?అన్నదే ఈ సినిమా కథ. జులై 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







