రమదాన్ సందర్భంగా 22,000కి పైగా మీల్స్ పంపిణీ
- June 05, 2019
రమదాన్ సీజన్లో పేద కుటుంబాలకు స్థానిక ఎన్జివో 'కన్సర్వింగ్ బౌంటీస్' 22,000లకి పైగా మీల్స్‌ని పంపిణీ చేసింది. కింగ్డమ్ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించడం ద్వారా, అలాగే హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి కలెక్ట్ చేసిన ఆహారాన్ని అవసరమైన వారికి అందించడం జరిగింది. హెల్త్ స్టాండర్డ్స్‌కి అనుగుణంగానే ఆహారాన్ని సేకరించి, పంపిణీ చేశామని ఎన్జిఓ సంస్థ ప్రతినిథులు తెలిపారు. 2018లోనూ ఈ సంస్థ పెద్దయెత్తున మీల్స్ పంపిణీ చేపట్టింది. అప్పట్లో 14,000కి పైగా మీల్స్ అందించగా, ఈసారి 22,000కి పైగా మీల్స్ పంపిణీ చేపట్టగలిగినట్లు నిర్వాహకులు తెలిపారు. 'యువర్ ఎక్సెస్ ఈజ్ సంవన్ ఎల్స్స్ రిలీఫ్' అనే నినాదంతో ఛారిటీ వర్క్ చేపట్టామని కన్సర్వింగ్ బౌంటీస్ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







