సనద్‌లో భారీ అగ్ని ప్రమాదం
- June 05, 2019
బహ్రెయిన్:సనద్ టౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇసా టౌన్, రిఫ్ఫా మరియు జుర్దామ్ సమీపంలోని సనద్ టౌన్‌లో సాయంత్రం 4.20 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 5 ఫైర్ ట్రక్కులు, 16 మంది అధికారులు అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఓ భవనం మొత్తం అగ్ని కీలలు వ్యాపించడంతో ఆస్తి నష్టం తీవ్రస్థాయిలో వుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవరికీ ఎలాంటి గాయాలైనట్లు, ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు ఫైర్ ఫైటర్స్.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







