ధోని, కేజ్రీవాల్ పేర్లను రాసి ఐసిస్ హెచ్చరికలు..ముంబైలో హైఅలర్ట్.!
- June 05, 2019
కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారత్‌లో విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమౌతోంది. ఈ క్రమంలో నవీ ముంబైలోని కోప్టే బ్రిడ్జ్‌కు సపోర్ట్‌గా ఉన్న ఓ పిల్లర్‌పై ఐసిస్‌ను పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు కనిపించాయి. ఐసిస్‌కు చెందిన కొందరి టెర్రరిస్ట్‌ల పేర్లను అక్కడ రాసిన దుండగులు.. వారందరూ ఆ సంస్థ కోసం పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. ఇక ఈ లిస్ట్‌లో ఉగ్రవాదులైన అబూ బకర్ అల్ బాక్దాదీ, హఫీజ్ సయ్యద్ పేర్లతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, క్రికెటర్ ధోని పేర్లను కూడా పొందుపరిచారు. దీంతో అధికారులు అప్రమత్తమై.. నవీ ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు.
కాగా దీనిపై నవీ ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మామూలుగా మద్యపానం సేవించేందుకే కొంతమంది యువకులు తరచుగా ఇక్కడికి వస్తుంటారని స్థానికులు తమతో చెప్పారని.. కానీ అన్ని కోణాల్లోనూ దీనిపై సమగ్ర విచారణను జరుపుతున్నామని పేర్కొన్నారు.
ఇక ఈ హెచ్చరికలపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ''ఈ మెసేజ్‌లలో ఎప్పుడు, ఎక్కడ విధ్వంసం సృష్టిస్తారో ఉగ్రవాదులు స్పష్టంగా తెలిపారు. ఇందులో ప్రముఖులు, రాజకీయ నాయకుల పేర్లను కోడ్ భాషలో రాశారు. దీన్నిమేము అసలు ఉపేక్షించం. దీనిపై దర్యాప్తు వేగంగా జరుగుతుంది'' అని పేర్కొన్నారు. కాగా దీనిపై నవీ ముంబయి క్రైమ్ బ్రాంచ్‌తో ఓ ప్రత్యేక బృందం దర్యాప్తును చేస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..