రియాద్‌లో మిన్నంటిన ఈద్ జంబరాలు
- June 06, 2019
రియాద్:రియాద్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ సిటీలోని ఈద్ సెలబ్రేషన్స్‌ని స్పాన్సర్ చేశారు. లరియాద్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ తారెక్ అల్ ఫారిస్, సీనియర్ అధికారులకు ఈ సందర్భంగా ఆయన స్వాగతం పలికారు. ప్రిన్స్ ఫైసల్, ఈద్ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కళా రూపాల్ని, ఈవెంట్స్‌ని తిలకించారు. మస్మాక్ ప్యాలెస్ వాల్స్‌పై ప్రదర్శించిన త్రీడీ ప్రెజెంటేషన్‌ని ఆహూతులతో కలిసి వీక్షించారు. చారిటబుల్ ఆర్గనైజేషన్ మెంబర్స్‌ని ఈ సందర్భంగా ప్రిన్స్ అభినందించారు. ఆర్ఫాన్స్తో కలిసి చేస్తున్న సేవా కార్యక్రమాల్ని కొనియాడారు. మస్మాక్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన ట్రెడిషనల్ సౌదీ అర్దెహ్ డాన్స్‌ని బృందం ఆస్వాదించింది. జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ, 80కి పైగా వివిధ రకాలైన ఈవెంట్స్‌ని ఈద్ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఏర్పాటు చేసింది. ఐదు రోజులపాటు ఈ ఈవెంట్స్ కొనసాగుతాయి.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







