రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
- June 06, 2019
అబుధాబిలోని అల్ ఫలాహ్ డిస్ట్రిక్ట్‌లో ఓ వాహనం అతి వేగంగా దూసుకొచ్చి ల్యాంప్ పోస్ట్‌ని ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు వున్నారు. చిన్నారుల తల్లి వాహనాన్ని నడుపుతుండగా, వాహనం అదుపు తప్పింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా వుంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతోపాటు, వారి నానీ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 15 ఏళ్ళ బాలుడు, అతని చెల్లెళ్ళు (12, 11 ఏళ్ళ వయసు) వున్నారు. అతి వేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని వివరించారు అబుదాబీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ - డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్సటర్నల్ జోన్స్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా అల్ సువైది. వాహనం నడుపుతున్న మహిళకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఆయన వివరించారు. వాహనదారులు పరిమిత వేగంతో వాహనాల్ని నడపాలనీ, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని అల్ సువైది విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







