తిరు దర్శకత్వంలో హీరో గోపీచంద్
- June 07, 2019
తెలుగు తెరపై యాక్షన్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన గోపీచంద్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే కథలను చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన తమిళ దర్శకుడు 'తిరు'తో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాకి 'బంగారు బుల్లోడు' టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయనున్నారని అంటున్నారు. తనను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడం కోసం కథానాయకుడు ఎలాంటి సాహసాలు చేశాడనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోందట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు గోపీచంద్ సరసన అలరించనున్నట్టుగా సమాచారం.
తాజా వార్తలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







