హిట్ అండ్ రన్: ఒకరి మృతి
- June 07, 2019
రస్ అల్ ఖైమాలో ఈద్ అల్ ఫితర్ రోజు రాత్రి జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఓ ఒమనీ పౌరుడు మృతి చెందారు. మృతుడి వయసు 50 సంవత్సరాలుగా పోలీసులు నిర్ధారించారు. మామురా పోలీస్ స్టేషన్ చీఫ్ కల్నల్ వలీద్ మాట్లాడుతూ, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి 16 ఏళ్ళ వయసు యువకుడనీ, అతను జీసీసీ జాతీయుడనీ చెప్పారు. నిందితుడికి లైసెన్స్ కూడా లేదని అధికారులు పేర్కొన్నారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, బాధితుడ్ని రక్షించేందుకు ప్రయత్నించామనీ, ఆసుపత్రికి తరలించగా అక్కడ అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారని పోలీసులు వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు రస్ అల్ ఖైమా పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







