ఏపీ కేబినెట్ జాబితా ఖరారు
- June 07, 2019
25 మందితో ఏపీ కేబినెట్ జాబితా ఖరారైంది. అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ మంత్రివర్గాన్ని గవర్నర్ ఆమోదించారు. దీంతో ఏపీ కొత్త మంత్రులు శనివారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఏపీ కేబినెట్ తొలిసారిగా భేటీ కానుంది. జగన్ ప్రమాణం తర్వాత మంత్రివర్గం కూర్పు ఇన్నాళ్లు వెంటాడిన ఉత్కంఠ వీడిపోయింది. పార్టీలో సీనియర్లు, సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుంటూ అన్ని వర్గాలకు ప్రధాన్యం కల్పించేలా జగన్ తన తొలి కేబినెట్ ను రూపొందించారు. రెడ్డి, కాపులకు చెరో నాలుగు మంత్రి పదవులు దక్కాయి. ఇక బీసీల్లో ఏడుగురికి మంత్రి పదవులు వరించాయి. ఐదు మంది ఎస్సీలకు కేబినెట్ లో అవకాశం కల్పించగా అందులో మాల వర్గానికి మూడు మాదికి రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇక మైనారిటీ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కమ్మ సామాజిక వర్గానికి ఒక్కో మంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్. స్పీకర్ పదవిని బీసీ వర్గానికి కేటాయించగా బ్రహ్మణ సమాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించారు.
తన తొలి మంత్రివర్గం జాబితాను సీఎం జగన్.. గవర్నర్ నరసింహన్ కు అందించారు. గవర్నర్ ఆమోదించటంతో 25 మంది మంత్రులు శనివారం ఉదయం 11 గంటల 49 నిమిషాలకు వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారిలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, కురసాల కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పిల్లి చంద్రబోస్ రెడ్డి ఉన్నారు. అలాగే బుగ్గన రాజేంద్రప్రసాద్, మేకపాటి గౌతమ్ రెడ్డి, పినిపే విశ్వరూప్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల నాని, పేర్ని నాని, కొడాలి నానిలను కేబినెట్ లోకి అవకాశం దక్కింది.
ఏపీ కేబినెట్ జాబితా..
1.బొత్స సత్యనారాయణ – చీపురుపల్లి
2.ధర్మాన కృష్ణదాస్ – నరసన్నపేట
3. అవంతి శ్రీనివాస్ – భీమిలి
4.కురసాల కన్నబాబు – కాకినాడ రూరల్
5. పుష్ప శ్రీవాణి – కురుపాం
6. పినిపె విశ్వరూప్ – అమలాపురం
7. పిల్లి సుభాష్ చంద్రబోస్ – ఎమ్మెల్సీ
8. ఆళ్ల నాని – ఏలూరు
9. బాలినేని శ్రీనివాస్ రెడ్డి – ఒంగోలు
10. తానేటి వనిత – కొవ్వూరు
11. కొడాలి నాని – గుడివాడ
12. మేకపాటి గౌతం రెడ్డి – ఆత్మకూరు
13. చెరుకువాడ శ్రీరంగనాథ రాజు – ఆచంట
14. పేర్ని నాని – మచిలీపట్నం
15. వెల్లంపల్లి శ్రీనివాస్ – విజయవాడ పశ్చిమ
16. మేకతోటి సుచరిత – ప్రత్తిపాడు
17. మోపిదేవి వెంకట రమణ
18. బుగ్గన రాజేంద్రనాథ్ – డోన్
19. నారాయణ స్వామి – గంగాధర నెల్లూరు
20. గుమ్మనూరు జయరాం – ఆలూరు
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – పుంగనూరు
22. అంజాద్ బాషా – కడప
23 .శంకర్ నారాయణ – పెనుకొండ
24. ఆళ్ల రామకృష్ణారెడ్డి – మంగళగిరి
25. అనిల్ కుమార్ యాదవ్ – నెల్లూరు
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..