దుబాయ్‌లో వర్షం కారణంగా 500 యాక్సిడెంట్లు

- January 03, 2016 , by Maagulf
దుబాయ్‌లో వర్షం కారణంగా 500 యాక్సిడెంట్లు

ఆరు గంటలపాటు కురిసిన భారీ వర్షంతో సుమారు 500 ట్రాఫిక్‌ యాక్సిడెంట్స్‌ చోటుచేసుకున్నట్లు దుబాయ్‌ పోలీసులు వెల్లడించారు. దుబాయ్‌ పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ యూనిట్‌ 2503కి పైగా ఎమర్జెన్సీ కాల్స్‌ స్వీకరించిందనీ, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యలో 515 ట్రాఫిక్స్‌ యాక్సిడెంట్స్‌ జరిగాయని అధికారులు వెల్లడించారు. మోటరిస్టులు వర్షం సమయంలో తమ వాహనాల్ని నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్‌ వర్గాలు సూచించాయి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు కార్లు వంటి వాహనాలకు తగిన దూరం పాటించాలని, వేగ నియంత్రణ తప్పనిసరని దుబాయ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి ఒమర్‌ అబ్దుల్లా అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ షామి చెప్పారు. విజిబులిటీ తక్కువగా ఉండటమే కాకుండా, వర్షం కారణంగా రోడ్లపై వాహనాలు జారిపోయే అవకాశం ఉందని ఈ కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com