రైళ్లలో మసాజ్.. తల, పాదాలకు మాత్రమే..
- June 09, 2019
చరిత్రలోనే తొలిసారిగా ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కొత్త సేవకు సిద్ధమైంది. రైళ్లలో ఇకపై ప్రయాణికులకు మసాజ్ సర్వీసు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందోర్ నుంచి వెళ్లే 39 రైళ్లలో మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వెస్టన్ రైల్వే జోన్ పరిధిలోని రత్లం డివిజన్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్టు అధికారులు తెలిపారు. గోల్డ్, డైమండ్, ప్లాటినమ్ కేటగిరీల్లో వంద నుంచి 3 వందల రూపాయలుగా మసాజ్ చార్జీలు నిర్ణయించారు. 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేస్తారు.
ప్రస్తుతానికి తల, పాదాలకు మాత్రమే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మసాజ్ చేస్తారు. ఎంపిక చేసిన రైళ్లలో గరిష్టంగా ఐదుగురు మసాజ్ చేసేవాళ్లను ఏర్పాటు చేస్తారు. వీళ్లకి రైల్వే శాఖ గుర్తింపుపత్రాలు జారీ చేస్తుంది. టిక్కెట్ రేట్లు పెంచకుండా రైల్వే ఆదాయం పెంచుకోవాలన్న లక్ష్యంలో భాగంగానే.. ఇలాంటి ప్రయోగాలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. మరో 20 రోజుల్లో మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి రైళ్లలోనూ మసాజ్ చేయించుకుంటూ ప్రయాణికులు ఎంజాయ్ చేయొచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







