నేడు తిరుమలకు ప్రధాని.. స్వాగతం పలికేందుకు ఏపీ సీఎం రెడీ..
- June 09, 2019
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం తిరుమల రానున్నారు. ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకోనున్నారు.
అధికారిక పర్యటన కోసం శ్రీలంక వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొలంబో నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడ ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ విడివిడిగా రోడ్డు మార్గాన తిరుమలకు పయనమవుతారు.
సాయంత్రం 5:30 నుంచి ఏడున్నర గంటల వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలలోనే ఉంటారు. దైవ దర్శనం అనంతరం తిరిగి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని, ముఖ్యమంత్రి చేరుకుంటారు.
అక్కడి నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడ్కోలు పలుకుతారు.
ప్రధానికి వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలోనే రాత్రి బస చేసే అవకాశం ఉంది. సోమవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమావేశం అనంతరం తిరుపతి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా సచివాలయానికి వెళ్తారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







