ఖతర్ లో అంబారాన్నాంటిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు
- June 09, 2019
ఖతర్:తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ లో ఆధ్వర్యం లో అశోకా హాల్,ఇండియన్ కల్చరల్ సెంటర్, దోహ లో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు మరియు రమదాన్ ఈద్ మీలాప్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.తెలంగాణ నుండి ప్రముఖ జానపద కళాకారిణి, రెలా రే గంగ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి సభాద్యక్షులుగా ఖతర్ లో భారత రాయబారి పి.కుమరన్ విచ్చేశారు.
తెలంగాణ ఉద్యమానికి సంఘభావంగా ఖతర్ లో 2011లో పది మంది కార్మికులు గుగ్గిల్ల రవి గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ గల్ఫ్ లో ఉద్యమానికి తమ వంతు పోరాటం చేయడమే కాకుండా తెలంగాణ సాంస్కృతిని ప్రతిబంబంచే దసరా, సంక్రాంతి , రాఖీ, వంటి పండుగలే కాకుండా కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వలస కార్మికుల అండగా నిలుస్తోంది అని తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ అధ్యక్షుడు శంకర్ సుందరగిరి తెలిపారు.
-- రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిథి,ఖతర్)
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







