ప్రముఖ నటుడు గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూత

- June 10, 2019 , by Maagulf
ప్రముఖ నటుడు గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూత

బెంగళూరు : ప్రముఖ నటుడు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో తన నివాసంలో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు. పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. రచయితగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్‌ అవార్డు ఆయనకు వరించింది. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌ అవార్డులతో సత్కరించింది.

గిరీష్‌ కర్నాడ్‌ పూర్తి పేరు గిరీష్‌ రఘునాత్‌ కర్నాడ్‌. 1938లో మే 19న మహారాష్ట్రలోని మథేరన్‌ ప్రాంతంలో జన్మించారు. నలభై ఏళ్ల సినీ కెరీర్‌లో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. నాలుగు ఫిలింఫేర్‌ అవార్డులు కూడా అందుకున్నారు. తెలుగులో 'ధర్మచక్రం', 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌', 'కొమరం పులి' చిత్రాల్లో నటించారు. ఆయన ఎక్కువగా కన్నడ, హిందీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. గిరీష్‌ చివరిగా నటించిన చిత్రం 'అప్నా దేశ్'. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కాబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com