బహ్రెయిన్‌లో ఘనంగా 'వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే'
- June 10, 2019

కింగ్‌డమ్ బహ్రెయిన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ముహరాక్‌లోని దోహాత్ అరాద్ పార్క్ స్టూడియో 224 వద్ద ఈ మేరకు ఓ కార్యక్రమం జరిగింది. 'ఎయిర్ పొల్యూషన్' థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహఙంచారు. సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ ఆంటిక్విటీస్ అలాగే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ సహకారంతో ఈ ఈవెంట్‌ని నిర్వహించారు. ఎస్‌సిఇ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టటర్ మొహమ్మద్ ముబారక్ డైనా, బిఎసిఎ డైరెక్టర్ జనరల్ ఫర్ కల్చర్ అండ్ ఆర్ట్స్ షేకా హలా బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా, యూఎన్‌ఇపి ఆఫీస్ రిప్రెజెంటేటివ్స్ అలాగే రీజినల్ డైరెక్టర్ ఫర్ వెస్ట్ ఆసియా సామి దిమాస్సి ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై వర్క్ షాప్‌ని నిర్వహించారు. బిఎసిఏ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న 45 మంది పార్టిసిపెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







