యూఏఈ స్కూల్స్ - సమ్మర్ టైమింగ్స్ ప్రకటన
- June 10, 2019
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూఏఈ స్కూల్స్‌కి సమ్మర్ టైమింగ్స్‌ని ప్రకటించింది. ఎంఓఈ కరికులమ్‌ని పాటించే స్కూల్స్‌కి జూన్ అలాగే జులై నెలలకుగాను ఈ టైమింగ్స్ వర్తిస్తాయి. కిండర్ గార్టెన్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు స్కూల్ వుంటుంది. టీచర్స్ షిఫ్ట్ మధ్యాహ్నం 1 గంటతో ముగుస్తుంది. ప్రైమరీ స్కూల్స్ (బాలురు) తొలి సెషన్ 7.15 నిమిషాలకు ప్రారంభమవుతుంది. లాస్ట్ సెషన్ 12.37 నిమిసాలకు ముగుస్తుంది. కొత్త ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్నింగ్ అసెంబ్లీ వుండదు. సెషన్స్ మధ్య మూడు నిమిషల బ్రేక్ వుంటుంది. అన్ని లెవల్స్‌కి ఒక్కో సెషన్ కోసం 40 నిమిషాలు కేటాయించారు. ఇంటర్మీడియట్ మరియు సెకెండరీ క్లాస్ బాయ్స్‌కి తొలి సెషన్ ఉదయం 7.15 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆఖరి సెషన్ మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ముగుస్తుంది. అదే బాలికల విషయానికొస్తే ఉదయం 8 గంటలకు తొలి సెషన్ స్టార్ట్ అయి, చివరి సెషన్ మధ్యాహ్నం 2.05 నిమిషాలకు ముగుస్తుంది.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







