బ్రిటన్ పై దాడి చేస్తామన్న ఐయస్
- January 03, 2016
ఈసారి తాము బ్రిటన్ మీద దాడిచేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తాజా వీడియోలో ప్రకటించింది. ఈ విషయాన్ని సిరియా మానవహక్కుల సంస్థ తెలిపింది. బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను ఐఎస్ ఉగ్రవాది ఒకరు 'ఫూల్' అని తిట్టారు. ఆ తర్వాత ఐదుగురి తలలు నరికేశాడు. ఈ ఐదుగురూ బ్రిటన్ తరఫున పనిచేస్తూ ఐఎస్ఐఎస్ మీద గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపించాడు.ఉత్తర సిరియాలో ఉగ్రవాద రాజధానిగా ఉన్న రక్కా ప్రాంతంలో ఈ వీడియోను తీసినట్లు తెలుస్తోంది. సిరియాలో ఐఎస్ఐఎస్ మీద దాడి చేయాల్సిన నైతిక, సైనిక బాధ్యత బ్రిటన్ మీద ఉందని ప్రధాని కామెరాన్ గత నెలలో అన్నారు. ఇప్పటికే ఇరాక్‌లో వైమానిక మార్గంలో ఐఎస్ఐఎస్ మీద దాడులు చేస్తున్న బ్రిటన్. ఇటీవలే సిరియాకు కూడా ఆ దాడులను విస్తరించింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







