లేబర్‌ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం: 22 మంది క్షేమం

- June 11, 2019 , by Maagulf
లేబర్‌ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం: 22 మంది క్షేమం

రస్‌ అల్‌ ఖైమాలోని ఓ లేబర్‌ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, ఫైర్‌ ఫైటర్స్‌ అత్యంత చాకచక్యంగా అందులో వున్న 22 మంది కార్మికుల్ని రక్షించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎయిర్‌ కండిషనర్‌, ఇతర వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయని అధికారులు పేర్కొఆన్నరు. అల్‌ ఉరైబి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే, ఫైర్‌ ఫైటర్స్‌ని, రెస్క్యూ టీమ్స్‌ని రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ విభాగం సంఘటనా స్థలానికి పంపించడం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే, ఆపరేషన్‌ ప్రారంభించిన ఫైర్‌ ఫైటర్స్‌, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. వాటర్‌ మరియు ఫోమ్‌ వినియోగించి, మంతల్ని అదుపు చేశారు. ఈ క్రమంలోనే 22 మంది కార్మికుల్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు ఫైర్‌ ఫైటర్స్‌. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com