తొలి హీట్‌ స్ట్రోక్‌ డెత్‌ నమోదు

తొలి హీట్‌ స్ట్రోక్‌ డెత్‌ నమోదు

కువైట్‌: పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో హీట్‌ స్ట్రోక్‌ కేసుల తీవ్రత పెరిగే అవకాశం వుంది. ఈ సీజన్‌లో తొలిసారిగా హీట్‌ స్ట్రోక్‌ కేసు నమోదయ్యింది. సుర్రాలో హీట్‌ స్ట్రోక్‌ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇంటీరియర్‌ మినిస్ట్రీ ఆపరేషన్స్‌ రూమ్‌కి సమాచారం అందగానే, సెక్యూరిటీ మెన్‌ అలాగే ఎమర్జనీ& సమెడికల్‌ పర్సనల్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే బాధితుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం ఎండలో వుండిపోవడం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడనీ, అతని పక్కనే వర్క్‌ టూల్స్‌ పడి వున్నాయని అధికారులు వివరించారు. 

 

Back to Top