ఈద్‌ ఈవెంట్స్‌లో పాల్గొన్న 3.5 మిలియన్‌ ప్రజలు

ఈద్‌ ఈవెంట్స్‌లో పాల్గొన్న 3.5 మిలియన్‌ ప్రజలు

రియాద్‌: మినిస్ట్రీ ఆఫ్‌ మున్సిపల్‌ అండ్‌ రూరల్‌ ఎఫైర్స్‌ నిర్వహించిన ఈద్‌ అల్‌ ఫితర్‌ కార్యక్రమాల్లో 3.5 మిలియన్‌ ప్రజలు పాల్గొన్నారు. మినిస్ట్రీ మొత్తం 991 కార్యక్రమాల్ని కింగ్‌డమ్‌ వ్యాప్తంగా నిర్వహించడమే కాదు, 136,739 బహుమతుల్ని కూడా విజిటర్స్‌, ప్రత్యేకించి పిల్లలకు అందించడం జరిగింది. గార్డెన్స్‌, పబ్లిక్‌ పార్క్స్‌, స్క్వేర్స్‌ మరియు బీచెస్‌లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఈవెంట్స్‌ కోసం ప్రత్యేకంగా ఫీల్డ్‌ టీమ్స్‌ని కూడా ఎస్సైన్‌ చేయడం జరిగింది. రియాద్‌ సెక్రెటేరియట్‌, అనుబంధ మునిసిపాలిటీలు 266 ఈవెంట్స్‌ నిర్వహించడం జరిగింది. మదీనా సెక్రెటేరియట్‌ 115 ఈవెంట్స్‌ నిర్వహించగా, తైఫ్‌ సెక్రెటేరియట్‌ 33 ఈవెంట్స్‌ని నిర్వహించింది. మిగతా సెక్రెటేరియట్స్‌ కూడా పెద్ద యెత్తున ఈవెంట్స్‌ నిర్వహించి, ప్రజల్ని ఆకట్టుకున్నాయి. 

Back to Top