పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో మ్యాన్ హోల్‌లో పడి..
- June 12, 2019
అబుధాబి: అరబ్ వ్యక్తి ఒకరు డ్రగ్స్ కేసులో తనపై అభియోగాలు మోపడాన్ని న్యాయస్థానంలో సవాల్ చేశారు. కేసు వివరాల్లోకి వెళితే, నిందితుడిపై అనుమానంతో పోలీస్ అధికారి ఒకరు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా, నిందితుడు పారిపోయాడు. ఈ క్రమంలో అతను మ్యాన్ హోల్‌లో పడిపోయారు. అతనితోపాటు, పోలీస్ అధికారికి కూడా ఈ ఘటనలో స్వల్ప గాయాలయ్యాయి. డ్రగ్స్ కేసుతోపాటు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన కేసులోనూ నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే, తన కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురై, వైద్య చికిత్స పొందాడనీ, ఈ క్రమంలో డాక్టర్ సూచించిన మందుల్ని వినియోగిస్తున్నాడనీ, మరోపక్క యాక్సిడెంట్ కారణంగా మానసిక సమస్యలూ తలెత్తాయనీ, అంతే తప్ప తన కుమారుడు నేరస్తుడు కాదని నిందితుడి తండ్రి న్యాయస్థానానికి విన్నవించారు. ఈ కేసు విచారణను జూన్ 25కి వాయిదా వేసింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..