సీఎం హామీ..సమ్మె విరమించుకున్న ఆర్టీసీ!
- June 12, 2019
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఈరోజు ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు ఈరోజు కలుసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలనీ, లేదంటే సమ్మెకు వెళ్లడం తప్ప తమకు మరో గత్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై సీఎం జగన్ స్పందిస్తూ... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పొందే సౌకర్యాలన్నీ ఆర్టీసీ కార్మికులకు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి సంబంధించిన న్యాయపరమైన అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సీఎం నిర్ణయంతో సంతృప్తి చెందిన ఆర్టీసీ జేఏసీ రేపటి నుంచి చేపట్టాల్సిన నిరవధిక సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. విలీన ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలలు పడుతుందని సీఎం చెప్పారన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







