2 మిలియన్ల దిగువకు చేరుకున్న వలసదారుల సంఖ్య

2 మిలియన్ల దిగువకు చేరుకున్న వలసదారుల సంఖ్య

మస్కట్‌: సుల్తానేట్‌లో వలసదారుల సంఖ్య 2 మిలియన్‌ దిగువకు చేరుకుంది. రెండేళ్ళలో ఇది తొలిసారి అని ఎన్‌సిఎస్‌ఐ పేర్కొంది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, దేశంలో 2,650,418 మంది ఒమనీయులు వుండగా, వలసదారుల సంఖ్య 1,997, 763. మొత్తం దేశ జనాభాలో 43 శాతం వలసదారులున్నారు. ఏప్రిల్‌ 2016 తర్వాత వలసదారుల సంఖ్య ఇదే అత్యల్పం. ఒమనైజేషన్‌ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత క్రమక్రమంగా దేశంలో వలసదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2018లో ఒమనైజేషన్‌ క్యాంపెయిన్‌ ప్రారంభమయ్యింది. సుమారు 87 జాబ్స్‌కి సంబంధించి ఆరు నెలల వీసా బ్యాన్‌ అమలు అవుతోంది. ప్రతి ఆరు నెలలకోసారి ఈ బ్యాన్‌ పొడిగింపబడుతోంది. ఒమనైజేషన్‌ పాలసీ కారణంగా ఇటీవల 60,000 మంది ఒమనీయులకు ఉద్యోగాలు వచ్చాయి. 

 

Back to Top