ముస్సాఫాలో ఇండియన్‌ మిషన్‌ సర్వీసెస్‌

ముస్సాఫాలో ఇండియన్‌ మిషన్‌ సర్వీసెస్‌

అబుధాబిలోని ఇండియన్‌ ఎంబసీ, అబుదాబీ మలయాళీ సమాజం నుంచి కాన్సులర్‌ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ముస్సాఫా ఇండస్ట్రియల్‌ ఏరియాలో వున్న ఒకే ఒక్క రిజిస్టర్డ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ ఇది. వేలాది మంది బ్లూ కాలర్‌ వర్కర్స్‌, వారి కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అధికారులు అంటున్నారు. పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌, అటెస్టేషన్‌ ఆఫ్‌ సర్టిఫికెట్స్‌ అలాగే వీసా సంబంధిత పేపర్‌ వర్క్స్‌ కోసం ఇకపై సుదూరంలో వున్న సిటీకి వెళ్ళాల్సిన అవసరం వుండదు. ఈ ఇనీషియేటివ్‌కి అప్రూవల్‌ లభించిందనీ, యూఏఈలో భారత రాయబారి నవదీప్‌ సింగ్‌ సూరి ప్రాథమికంగా ఈ మేరకు అప్రూవల్‌ ఇచ్చారని ఎంబసీ కౌన్సెలర్‌ రాజమురుగన్‌ చెప్పారు. ఈ ఆదివారం ఎంబసీకి చెందిన అధికారులు అబుధాబి మలయాళ సమాజంను సందర్శించి, ఇక్కడి వసతుల్ని తెలుసుకుంటారని ఆయన అన్నారు. 

 

Back to Top